Healthhealth tips in telugu

Weight Loss Tips:ఈ రెండు కలిపి ఇలా తీసుకుంటే అధిక బరువు, డయబెటిస్, జీర్ణ సమస్యలు ఉండవు

Fenugreek seeds and ajwain Water In weight loss : మెంతులు,వాము ఈ రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులు,వాములను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులు,వాము తింటూ ఆ నీటిని తాగాలి.

అలా నానబెట్టుకోవటం కుదరని వారు ఒక కప్పు మెంతులు, రెండు కప్పుల వాము తీసుకొని పాన్ లో వేసి వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి వేసి బాగా కలిపి తాగాలి. అలా కుదరని వారు భోజనంలో ఈ పొడిని మొదటి ముద్దగా తినాలి.

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్,కడుపులో మంట,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఏమి ఉండవు. అలాగే ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.

తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగ మారకుండా శక్తిగా మారుస్తుంది. అలాగే శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో రోగనిరోదక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వాములో ఉండే థైమోల్, మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా ఉండేయల్ చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.