Kitchenvantalu

Aratikaya Allam Ulli Karam:అర‌టికాయ‌తో అల్లం ఉల్లి కారం కూర‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఒక ప‌ట్టు ప‌డ‌తారు..!

Guntur Aratikaya Allam Ulli Karam Recipe: అరటి పండులా తీసుకున్నా,కాయలా తీసుకున్నా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు. పచ్చి అరటికాయలోకి అల్లం,ఉల్లికారం తగిలించి ఫ్రై చేసి చూడండి రుచి అమోఘం అంటారు.

కావాల్సిన పధార్ధాలు
అరటి కాయలు- 2
నీళ్లు – ½ లీటర్
ఉప్పు – కొద్దిగా
పసుపు – కొద్దిగా
అల్లం, ఉల్లి కారం కోసం..
ఉల్లిపాయ తరుగు- 2
పచ్చిమిర్చి- 4-5
అల్లం- ½ ఇంచ్
కూర కోసం..
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు- 1 టీస్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్
ఎండుమిర్చి – 2
పచ్చి శెనగపప్పు- 1 టీ స్పూన్
మినపప్పు- 1 టీ స్పూన్
కరివేపాకు- 2 రెబ్బలు
ఉప్పు – తగినంత
పసుపు – ¼ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నిమ్మరసం- 1 టీ స్పూన్

తయారి విధానం
1.గిన్నెలో నీళ్లు మరిగించి సగానికి కట్ చేసుకున్న అరటికాయలను ఉప్పు ,పసుపు వేసి 80 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2.చల్లారక తొక్క తీసుకోని చాక్ తో కాని ,ఫోర్క్ తో గాని ఎనుపు కోవాలి.
3.మిక్సిలో ఉల్లిపాయ,అల్లం,పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ ల గ్రైండ్ చేసుకోవాలి.
4.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర,శెనగపప్పు,మినపప్పు వేసి వేపుకోవాలి.

5.వేగిన తాలింపులో ఉల్లి ముద్ద ,ఉప్పు,పసుపు,కరివేపాకు వేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి.
6.వేగిన ఉల్లి ముద్దలో ఎనుపుకున్న అరటి ముద్దను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి.
7.మూతపెట్టుకోని మాడిపోకుండా 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి.
8.చివరిగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.అరటి అల్లం,ఉల్లికారం రెడీ అయిపోయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News