Kitchenvantalu

Egg Cubes Masala:ఇంట్లో అందరికి నచ్చేలా గుడ్డు కూర ఇలా చెయ్యండి.. సూపర్ ఉంటుంది

Egg Cubes Masala Recipe:ఇంట్లో అందరికి నచ్చేలా గుడ్డు కూర ఇలా చెయ్యండి.. సూపర్ ఉంటుంది. ఎగ్ తో స్పెషల్స్ మెదలు పెడితే ఎన్ని వెరైటీలో. ఎలా చేసినా గుడ్డు కూరలు అదుర్సే. కొంచెం వెరైటీగా,కొంచెం స్పెషల్ గా కోడి గుడ్డు జున్ను ముక్కల కూర చేసేద్దాం.

కావాల్సిన పధార్ధాలు
కోడిగుడ్డు జున్ను ముక్కల కోసం..
గుడ్లు- 6
ఉప్పు- కొద్దిగా
మిరయాల పొడి- 1 టీస్పూన్
పసుపు- ¼ టీస్పూన్
గ్రేవీ కోసం..
నూనె- 3 టేబుల్ స్పూన్స్
మిరయాలు- ¼ టీ స్పూన్
జీలకర్ర- 1 టీ స్పూన్
యాలకులు- 3
ఎండుమిర్చి- 7-8
దాల్చిన చెక్క – 1 ఇంచ్
లవంగాలు- 3
గసగసాలు- 1 టేబుల్ స్పూన్స్
ధనియాలు -1 టేబుల్ స్పూన్స్
అల్లం – 1 ఇంచ్
వెల్లుల్లి- 4-5
కరివేపాకు- 1 రెబ్బ
ఉల్లిపాయ చీలికలు- కొద్దిగా
పచ్చిమిర్చి – 3
టమాటోలు- 2
ఉప్పు – తగినంత
పసుపు- ¼ టీస్పూన్
పెరుగు- ½ కప్పు
కూర కోసం
నూనె- 3 టేబుల్ స్పూన్స్
కరివేపాకు- 1 రెబ్బ
నీళ్లు 300 ml
కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్స్

తయారి విధానం
1.ఒక గిన్నెలోకి గుడ్డు సొనలను తీసుకోని పసుపు,ఉప్పు,మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయాలి.
2. ఒక గ్లాస్ కి నూనె రాసి అందులో ముప్పావు వంతు గుడ్డు సొనను నింపి మరుగుతన్న నీళ్లలో ఉంచి పన్నెండు నిమిషాల పాటు స్టీమ్ చేసి తీయాలి.
3.చల్లారిన గుడ్డును చాక్ సాయంతో తీసుకోవాలి.
4.తర్వాత పన్నీర్ ముక్కల లాగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి.
5.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడి చేసి గ్రేవీ కోసం పెట్టుకున్న దినుసులన్ని దోరగా వేపుకోవాలి.

6.వేగిన మసాల దినుసులలో ఉల్లిపాయ తరుగు ,పచ్చి మిర్చి వేసుకోని కాస్తా మెత్త పడనివ్వాలి.
7.మెత్తపడిన ఉల్లిపాయ ముక్కల్లో గసగసాలువేసి అందులోకి టమాట ముక్కలు,ఉప్పు,పసుపు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
8.మగ్గిన టమాటోలని ,పెరుగు ,నీళ్లు మిక్సి జార్లో వేసి మెత్తని పేస్ట్ ల గ్రైండ్ చేసుకోవాలి.
9.ప్యాన్ లో నూనే వేసి వేడెక్కాక అందులో కరివేపాకు వేసి..గ్రైండ్ చేసుకున్న గ్రేవి, నీళ్లు పోసి మూతపెట్టి పదిహేను నిమిషాలు మరగనివ్వాలి.
10.మరుగుతున్న గ్రేవిలో గుడ్డు ముక్కలు కొత్తిమీర వేసుకోని ఎనిమిది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
11.అంతే ఘుమ ఘుమలాడే కోడి గుడ్డు జున్ను ముక్కల కూడ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News