Healthhealth tips in telugu

Eye Health :ఈ ఆకుకూరలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు… ముఖ్యంగా కంటి సమస్యలకు

ponnaganti kura health benefits : ఈ చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. చాలా చవకగా దొరికే ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. రాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. ఈ కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

ఈ ఆకు కూర లో బీటా కెరోటిన్, ఐరన్,ఫైబర్, క్యాలిష్యం, విటమిన్ ఎ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూరను పప్పుగా చేసుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కూడా వేసుకోవచ్చు ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. మోకాలు నొప్పులు ఉన్నవారు వారంలో మూడుసార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ కూర ప్రస్తుతం అన్ని ఆకుకూరల వలె విరివిగానే లభ్యమవుతోంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని తినవచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది తల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో చెబుతూ ఉంటారు. కంటికి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.

మన ప్రకృతిలో లభించే అన్ని ఆకుకూరలు మనకు ఏదో రకంగా ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి మిస్ కాకుండా తినటానికి ప్రయత్నం చేయండి. కంటి చూపు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. మన అమ్మమ్మలు నానమ్మలు కాలంలో ఎక్కువగా ఈ ఆకుకూరను ఉపయోగించేవారు.

ఈ ఆకును మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాస్తే మొటిమలు,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.