Kitchenvantalu

Easy Tomato Egg Pulusu:బ్యాచిలర్స్ స్పెషల్ టమాటో గుడ్డు పులుసు.. సూపర్ గా ఉంటుంది

Easy Tomato Egg Pulusu Recipe: ఎక్కువ టైం తీసుకోకుండా,ఎక్కువ టేస్టీగా ఉండే కర్రీ అంటే ఎగ్ కర్రీనే. ఎలా చేసినా ఎగ్ కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. టమాటో లో మిక్స్ చేసి ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయండి.

కావాల్సిన పధార్ధాలు
నూనె- 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు- 1 టీస్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్
ఉల్లిపాయ తరుగు -1
టమాటోలు- 4
పసుపు- ¼ టీస్పూన్
ఉప్పు- తగినంత
పచ్చిమిర్చి చీలికలు- 3
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్
కరివేపాకు- 1 రెబ్బ
ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్
కారం-1.5 టీ స్పూన్
గుడ్లు- 4
నీళ్లు- 1 లీటర్
మిరియాల పొడి- ½ టీ స్పూన్
కొత్తిమీర తరుగు- 2 టేబుల్ స్పూన్స్

తయారి విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర వేసి చిటపట లాడనివ్వాలి.
2.అందులోకి ఉల్లిపాయ తరుగు ,ఉప్పు,పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తపడనివ్వాలి.
3.ఉల్లిపాయలు మెత్తపడ్డాక టమాటో ముక్కలు ,పచ్చిమిర్చి వేసి గుజ్జుగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
4.ఇప్పుడు అందులోకి ధనియాల పొడి,కారం వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి.

5.వేగిన టమాటో లో అర లీటర్ నీళ్లు పోసి హై ఫ్లేమ్ పై బాగా మరగనివ్వాలి.
6.మరుగుతున్న గ్రేవిలో గుడ్లను పగుల కొట్టి సొనను ముకుడు అంతటా వేసుకోవాలి.
7.గరిట తో కదపకుండా అలాగే వదిలేయాలి.
8.పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై పెడితే గుడ్డు పరఫెక్ట్ గా ఉడుకుతుంది.
9.ఇక చివరగా మిరియాల పొడి,కొత్తిమీర చల్లుకోని నెమ్మదిగా కలుపుకుంటే వేడి వేడి ఎగ్ టమాటో కర్రీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News