Kitchenvantalu

Curd Dosa:రుచికరమైన స్పాంజి పెరుగు దోశ.. తింటుంటే నోట్లోనే కరిగిపోతుందంతే!

Curd Dosa Recipe: ఆంధ్రా ఫేమస్ పుల్లట్టు ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు.అదెలాగో చూసేయండి. పుల్లని రుచితో చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్ధాలు
పెరుగు – 1 కప్పు
బియ్యం – 2 కప్పులు
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – 2-3
కొత్తిమీర – కొద్దిగా
ఉల్లిపాయ తరుగు – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 7-8
పుట్నాలు – ½ కప్పు
వెల్లుల్లి – 7 రెమ్మలు
తయారీ విధానం

1.ముందుగా తీసుకున్న పెరుగును పల్చని మజ్జిగలా తయారు చేసుకోవాలి.
2.ఇప్పుడు శుభ్రంగా కడిగిన బియ్యాన్ని మజ్జిగ లో 4-5 గంటలపాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు ఒక మిక్సి జార్ లోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు,జీలకర్ర,పుట్నాలు,ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు,ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4.గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నె లో తీసుకోని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసారాన్ని బట్టి కొద్దిగా వాటర్ ,లేదా నానబెట్టిన మజ్జిగ నీళ్లను వాడుకోవచ్చు.

6.గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ ని ఒక గిన్నెలో తీసుకోని అందులోకి తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి తరుగు,కొత్తిమీర తరుగు,చిటికెడు బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకోవాలి.
7.ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకోని వేడెక్కిన తర్వాత గరిటడు పిండిని వేసి దోశను స్ప్రెడ్ చేసుకోవాలి.
8.స్ప్రెడ్ చేసుకున్న దోశ పై ముందుగా తయారు చేసుకున్న పుట్నాల పొడిని చల్లుకోని అంచులకు నూనే వేసి కాసేపు మూతపెట్టుకోవాలి.
9.రెండు నిమిషాల తర్వాత కాలిన అట్టును తీసి సర్వ్ చేసుకోవడమే.