Beauty TipsHealth

Hair Care Tips:1 స్పూన్ నూనె మీ జుట్టును 15 రోజుల్లో నల్లగా,ఒత్తుగా,పొడవుగా మార్చుతుంది

Curry Leaves and coconut Hair Fall Tips In telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం మూడు ఇంగ్రీడెంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సహజమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు..

ఒక సీసాలో 150 గ్రాముల కొబ్బరి నూనె పోసి దానిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజీ గింజలు, 2 స్పూన్స్ ఎండిన ఉసిరి ముక్కలు , 2 రెబ్బల కరివేపాకు, 6 తులసి ఆకులు, 6 లవంగాలు వేసి మూత పెట్టి 2 రోజులు ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఈ నూనెను తలకు రాసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

జుట్టు కుదుళ్లు బలంగా మరి జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ నూనెలో ఉన్న పోషకాలు అన్ని జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.