Healthhealth tips in telugu

Nail Polish :నెయిల్ పాలిష్ తరచూ మారుస్తున్నారా…ఈ విషయాలు తెలుసుకోవలసిందే

Effects of Nail Polish : ప్రతి అమ్మాయి గోర్లు అందంగా,ఆకర్షిణియంగా ఉండాలని గోళ్ళకు నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటారు. అలా వేస్తే గోళ్ళ అందం రెట్టింపు అవుతుంది. అయితే ఒకప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్లినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ కి వెళ్లినప్పుడు మాత్రమే వేసుకొనేవారు. ఇప్పుడు అయితే ప్రతి రోజు డ్రెస్ కి తగ్గట్టుగా గోళ్ళకు నెయిల్ పాలిష్ వేస్తున్నారు.

అలాగే ఒక్కో గోరుకి ఒక్కో రంగు వేసే ట్రెండ్ కూడా ఉంది. నెయిల్ పాలిష్ గోర్లకు అందాన్ని ఇచ్చిన సరే ఆరోగ్యపరంగా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెయిల్ పాలిష్ ఎక్కువగా వేసుకోవటం వలన బరువు పెరిగే అవకాశం ఉందట. నెయిల్ పాలిష్ కి బరువుకి సంబందం ఏమిటా అని ఆలోచిస్తున్నారా …

నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నెందుకు ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం కలుపుతారు. ఈ రసాయనం ప్రతి నెయిల్ పాలిష్ లోనూ ఉంటుంది. నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో చర్మం మీద పడుతుంది. అలా పడినప్పుడు నెయిల్ పాలిష్ లో ఉండే ట్రైఫెనైల్ ఫాస్పేట్ రసాయనం శరీరంలోని హార్మోన్‌లపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది.

హార్మోన్స్ మీద ప్రభావం పడటంతో బరువు పెరుగుతారు. అలాగే గర్భదరణ సమయంలో నెయిల్ పాలిష్ లకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే క‌డుపులోని బిడ్డ ఎదుగుద‌ల‌పై ప్ర‌భావం చూపుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.