Kitchenvantalu

Vankaya Methi Curry:చపాతీలోకి, రైస్ లోకి బాగుండే కర్రీ.. వంకాయ మెంతి కూర

Vankaya Methi Curry Recipe: వంకాయ తో ఏ కాంబినేషన్ చేసినా రుచి అదిరిపోతుంది. వంటికి చలువ చేసే మెంథీ ఆకులతో వంకాయ చేసి చూడండి చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్ధాలు
వంకాయ – ½ kg
మెంతిఆకులు – ½ కప్పు
నూనె – 1 ½ టేబుల్ స్పూన్
టమోటాలు – 2
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి పేస్ట్ – 4-5
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర – 1 టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలగా కట్ చేసుకోని ఉప్పు కలిపిన నీళ్లలో వేసుకోవాలి.
2.ఇప్పుటు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు వేసి దోరగా వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి.
4.ఇప్పుడు సన్నగా తరిగిన మేథీ ఆకులను వేసి బాగా కలుపుకోవాలి.

5.మేథీ కలుపుకున్నాక అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కలుపుకోవాలి.
6.పచ్చిమిర్చి పచ్చివాసన పోయాక వంకాయ ముక్కలను వేసి కలుపి కాసేపు ఉడకనివ్వాలి.
5.తర్వాత అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు మగ్గించుకోవాలి.
6.ఇప్పుడు వంకాయలు ఉడకిపోయి, టమాట మగ్గి చిక్కటి గ్రేవిగా మారుతుండగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ మేథీ కూర రెడీ.