Tea Benefits:రోజు ఉదయాన్నే టీ తాగుతున్నారా..అయితే ఈ విషయం తెలుసుకోండి…
TEa Benefits In telugu :మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగవలసిందే. అలా తాగకపోతే ఏమి తోచదు. అలాగే రోజంతా ఏ పని చేయాలని అనిపించదు. రోజు ఒక కప్పు టీ తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతీ రోజూ టీ తాగితే ఎక్కువ రోజులు బతుకుతారని చైనీయులు ఎక్కువగా నమ్ముతారట..
అక్కడి వారు టీని ఎక్కువ ఇష్టంగా తాగుతారు. అదే విధంగా జీవనకాలం ఎక్కువగా ఉండేది కూడా చైనాలోనే. దీంతో టీ తాగడం వల్ల ఎక్కువ కాలం జీవించొచ్చు అనే నమ్మకం ఏర్పడింది. ఒక కప్పు టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కప్పు పండ్ల రసం కంటే టీలోనే అధికంగా ఉంటాయి. కాబట్టి టీ ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు..
టీ తాగడం వల్ల ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలసట,నీరసం,నిసత్తువ వంటివి ఉన్నపుడు ఒక కప్పు టీ తాగితే అలసట అంతా తగ్గిపోయి ఉషారు వస్తుంది. ఆ టీలో యాలకులు, అల్లం వేసి తాగితే వ్యాధి నిరోధకత పెరుగుతంది.
అయితే.. టీ మంచిది కదా అని ఎక్కువగా తాగొద్దు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యలే వస్తాయని నిపుణులు చెప్పు తున్నారు. అందుకే రోజుకి రెండు నుంచి మూడు కప్పుల టీ మంచిదే కానీ, అంతకు మించి టీ తాగడం అంత మంచిది కాదని చెబుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.