Kitchenvantalu

Cleaning Tips:గోడ గడియారంపై దుమ్ము, ధూళి పేరుకుపోయిందా…ఇలా చేస్తే నిమిషంలో క్లీన్ అవుతుంది

Wall Clock Cleaning Tips:ప్రతి ఇంటిలో సాధారణంగా గోడ గడియారం ఉంటుంది. గోడ గడియారం చాలా ఎత్తులో ఉంటుంది. గోడ గడియారం శుభ్రం చేయటం చాలా కష్టం. అయితే దుమ్ము పట్టిన గడియారంను చాలా సులువుగా శుభ్రం చేసుకోవడానికి ఇప్పుడు చిట్కాలు తెలుసుకుందాం. గోడ గడియారం ఇంటి అందాన్ని పెంచుతుంది.

గడియారం దుమ్ము పట్టి శుభ్రంగా లేకపోతే గడియారం ముళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. గోడ గడియారంను సులభంగా ఎలా శుభ్రం చేయాలో చూద్దాం. గోడ గడియారాన్ని గోడ నుంచి తీసి శుభ్రంగా తుడిచి గడియారం గాజు మరియు ఇతర భాగాలను శుభ్రం చేయాలి. అలాగే గడియారం వెనక గోడ కూడా మురికిగా ఉంటుంది. దానిని కూడా శుభ్రం చేయాలి.

మైక్రో ఫైబర్ క్లాత్ చాలా మృదువుగా ఉంటుంది. గీతలు పడకుండా శుభ్రం చేయటానికి ఈ క్లాత్ చాలా బాగా సహాయపడుతుంది. ఇంట్లో పోర్టబుల్ నిచ్చెన లేదా ఎత్తైన స్టూల్ ఉంటే, మీరు దానిపై ఎక్కి దుమ్ము దులపడం మరియు శుభ్రపరచడం చేయవచ్చు.