Kitchenvantalu

Ullipaaya Pulusu:ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఉల్లిపాయ‌ల‌తో ఇలా పులుసు చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Ullipaaya Pulusu Recipe : ఉల్లి చేసే మేలు తల్లికూడ చేయదని సామెత తెల్సిందే కదా.ఉల్లి లేని వంట ఊహించలేం.అన్ని వంటల్లో వాడుకునే ఉల్లిపాయలతో పులుసు చేస్తారని మీకు తెల్సా.ఓసారి మీరు కూడ ట్రై చేయండి.

కావాల్సిన పధార్ధాలు
ఉల్లిపాయ ముక్కలు- ½ కప్పు
సాంబార్ ఉల్లిపాయలు- 10-12
నూనె- 1.5 టేబుల్ స్పూన్
ఉప్పు –తగినంత
కారం- 1 స్పూన్
బెల్లం- 3 టేబుల్ స్పూన్స్
పసుపు- ¼ టీ స్పూన్
పచ్చిమిర్చి- 2
బియ్యం పిండి- 1 టీ స్పూన్
చింతపండు రసం- 300 ml
నీళ్లు- 350 ml
మసాలా కోసం..
నూనె- 1 టేబుల్ స్పూన్
కరివేపాకు-1 రెమ్మ
ఆవాలు- ½ టీస్పూన్
జీలకర్ర-1/2 టీస్పూన్
మెంతులు- ½ టీ స్పూన్
ఎండుమిర్చి- 2
ఇంగువ- చిటికెడు

తయారి విధానం
1.స్టవ్ పై బాండి పెట్టుకొని నూనె వేసి వేడిక్కి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,సాంబార్ ఉల్లిపాయలు,ఉప్పు,మిరయాల పొడి వేసి వేయించుకోవాలి.
2.మెత్తపడిన ఉల్లిపాయల్లో చింతపండు రసం ,నీళ్లు,బెల్లం,పచ్చిమిర్చి ముక్కలు,పసుపు వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
3.ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి బియ్యం పిండిని ఉండలు లేకుండా పేస్ట్ ల కలిపి చింతపండు రసంలో వేసి కాస్త చిక్కపడనివ్వాలి.

4.ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నూనే వేడి చేసి అందులోకి మెంతులు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,ఇంగువ వేసి వేగాక చింతపండు పులుసులో కలుపుకోవాలి.
5.చింతపండు పులుసు తాలింపు తోపాటు ఐదు నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే వేడి వేడి ఉల్లిపాయ పులుసు రెడీ అయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News