Kitchenvantalu

Kitchen Hacks:అరటిపండ్లు నల్లగా మారుతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి

Banana Storage Tips in telugu:అరటిపండ్లు ఒకటి రెండు రోజుల్లో నల్లగా మారుతూ ఉండటం సహజమే. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో అరటి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అరటి పండ్లను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే అరటిపండ్లు ఎక్కువ రోజులు నల్లగా మారకుండా నిల్వ ఉంటాయి.

అరటిపండ్లను తాడులో వ్రేలాడదీస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అందుకే మార్కెట్ లో అరటి పండ్లను వ్రేలాడదీస్తారు. అరటి పండ్లను వ్రేలాడదీయటానికి ఒక బనానా స్టాండ్ కూడా కొనుగోలు చేయవచ్చు.

అరటిపండు కొమ్మ భాగంలో ప్లాస్టిక్‌ను చుట్టాలి. ఈ విధంగా చేయటం వలన అరటిపండ్ల నుంచి విడుదలయ్యే ఇథిలీన్ గ్యాస్ తక్కువగా విడుదలై అరటిపండ్లు తాజాగా ఉంటాయి.

నీటిలో కొద్దిగా వెనిగర్ కలపండి.. మరియు ఈ నీటితో అరటిపండ్లను శుభ్రం చేయండి. అయితే తెల్ల వెనిగర్ ఉపయోగించాలి. ఈ విధంగా చేయటం వలన అరటి పండ్లు ఎక్కువగా రోజులు నల్లగా మారకుండా తాజాగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.