Kitchenvantalu

Munagakau Rice:ఎన్నో పోషకాలు ఉన్న మునగాకు రైస్ ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు

Munagakau Rice Recipe: మునకాయలోనే కాదు, ఆకులో కూడా అంతే పోషకాలు ఉంటాయి. మునగాకుకు తోడుగా, పప్పులు, మసాలాలు వేసి, రైస్ చేసారంటే, నోటికి కమ్మగా ఉంటుంది. పైగా ఆరోగ్యం కూడా..

కావాల్సిన పదార్ధాలు
మునగాకు పొడి కోసం..
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 1
జీలకర్ర – 1 టీ స్పూన్
వెల్లుల్లి – 5
మునగాకు – 50 గ్రాములు

తాళింపు కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 2
ఆవాలు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
జీడిపప్పు – 10
దంచిన వెల్లుల్లి – 4
ఉప్పు –తగినంత
అన్నం – 180 గ్రాములు
మిరియాల పొడి – 1 టీ స్పూన్

తయారీ విధానం.
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని, తాళింపు కోసం ఉంచిన పదార్ధాలు ఉంచి, దోరగా వేపుకోవాలి.
2.వేగిన పప్పులలో, మునగాకు, వేసి చెమ్మ పోయే వరకు వేపుకోవాలి.
3. చెమ్మ పోయిన తర్వాత వెల్లుల్లి కూడా వేపుకోవాలి.

4. వేగిన ఈ పదార్ధాలను చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
5. ఇప్పుడు తాళింపు కోసం, స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, తాళింపు కోసం ఉంచిన పదార్దాలను వేసి, వేగాక, ఉడికించిన అన్నం, ఉప్పు, మునగాకు పొడి వేసి, హై ఫ్లేమ్ పై టాస్ చేయాలి.
6. ఇప్పుడు చివరగా, మిరియాల పోడి వేసి , టాస్ చేసుకుని, సెర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News