Beauty TipsHealth

Face Glow Tips:రాత్రి ఇలా చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు అన్ని మాయం అవుతాయి

Milk And Lemon Black spots in face :మనలో ప్రతి ఒక్కరూ ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం కూడా సహజమే. ఈ రోజు ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉండడానికి ఒక చిట్కా అని తెలుసుకుందాం. ముఖం కాంతివంతంగా మారటానికి ఎంత ఖర్చు పెట్తటానికి అయినా వెనకడుగు వేయరు.

తక్కువ ఖర్చుతో ముఖం మీద మచ్చలను ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ పాలు,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 2 లేదా 3 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా పాలు అడ్డుకుంటాయి.చర్మంలోని మురికిని, మృత కణాలను తొలగించటంలో పాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పాలు శరీరం బయట, లోపల కూడా క్లెన్సర్‌లా ఉపయోగపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.