Beauty TipsHealth

White Hair:నువ్వుల నూనెతో ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం

White Hair Home Care Tips :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 50,60 ఏళ్ళు వచ్చాక తెల్లజుట్టు సమస్య అనేది వస్తుంది. కానీ ప్రస్తుతం మారిన ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కాలుష్యం, ఒత్తిడి, పోష‌కాల లోపం, స్మోకింగ్‌ వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోను తెల్లజుట్టు సమస్య వస్తుంది.

చిన్న వయస్సులో తెల్లజుట్టు సమస్య రాగానే కంగారూ పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తెల్లజుట్టు సమస్యను పరిష్కారం చేయటానికి నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది.

దీని కోసం నువ్వుల నూనె మ‌రియు కొబ్బ‌రి నూనె స‌మానంగా తీసుకుని బాగా కలిపి రాత్రి పడుకొనే ముందు తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

నువ్వుల నూనెలో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు అంది ఒత్తుగా, న‌ల్ల‌గా ఎదిగేందుకు స‌హాయ ‌ప‌డ‌తాయి. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయ‌డంలో నువ్వుల నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అందువ‌ల్ల‌, రెండు లేదా మూడు రోజుల‌కు ఒక‌సారి నువ్వుల నూనెను జుట్టుకు బాగా ప‌ట్టించి మసాజ్ చేసిన మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.