Beauty TipsHealth

Hair Care Tips:జుట్టు రాలకుండా ఉసిరి ఎంత మాయ చేస్తుందో చూడండి…అసలు నమ్మలేరు

Amla and coconut Hair Fall Tips: ఉసిరి అంటే మన అందరికి తెలుసు. ఉసిరికాయలు ఒకప్పుడు సీజన్ లో మాత్రమే దొరికేయి. కానీ ఇప్పుడు సంవత్సరం పొడవునా దొరుకుతున్నాయి. అలాగే ఉసిరి పొడి కూడా లభ్యం అవుతుంది. ఉసిరి జుట్టు సంరక్షణలో బాగా సహాయపడుతుంది. ఉసిరిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి నూనెలో కొన్ని ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి వేసి వేడి చేయండి. రెండు మూడు నిమిషాల తరువాత వెచ్చని నూనెని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒకటి లేదా రెండు గంటల తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయండి.

ఉసిరి జ్యూస్ మరియు నిమ్మరసంను కలిపి జుట్టుకి పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయండి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె జుట్టు రాలే సమస్య,చుండ్రు తగ్గటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా కూడా మారుతుంది.

రెండు టేబుల్ స్పూన్ యూకలిప్టస్ నూనెలో ఉసిరి ముక్కలను రాత్రంతా నానబెట్టండి. ఒక మందపాటి పేస్ట్ సిద్ధం చేయడానికి గుడ్డు మరియు పెరుగును ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ పేస్ట్‌ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై బాగా పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.