Social media:“కుమారి ఆంటీ” తో పాటు… సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులు వీరే..!
ఒకప్పుడు పాపులారిటీ సంపాదించాలంటే చాలా కష్టం అయ్యేది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయి పోతున్నారు. అలా ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అవ్వడమే కాకుండా, టీవీ షోస్ వరకు కూడా వెళ్లారు.
టిక్ టాక్ లో వీడియోలు చేసి, ఆ తర్వాత youtube లో వీడియోలు చేస్తూ..రైతుబిడ్డ అని చెప్పుకుంటూ, తనని బిగ్ బాస్ కి పంపాలని కోరేవాడు. పల్లవి ప్రశాంత్ రీల్స్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యి అతని ప్రయాణం బిగ్ బాస్ వరకు తీసుకువెళ్లి విజేతని కూడా చేసింది.
మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేసే గంగవ్వ బిగ్ బాస్ ప్రోగ్రాంకి వెళ్ళారు. అక్కడి నుండి వచ్చేశాక ఎన్నో సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది.
ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసి కాస్త ఎక్కువ మొత్తంలోనే ఓట్లను సాధించారు బర్రెలక్క శిరీష. ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీ చేస్తాను అని బర్రెలక్క ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారానే పాపులారిటి సంపాదించారు.
హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నడుపుకునే కుమారి ఆంటీ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి… ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం ప్రోగ్రాంలో కూడా కుమారి ఆంటీని పిలిచారు. వ్యాపారం పెరగటమే కాకుండా టివిలో కనిపించే అవకాశం కూడా వచ్చింది.