Healthhealth tips in telugu

Alovera Side Effects:ఆ సమస్యలు ఉన్నవారు కలబంద తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా?

Alovera Side Effects: కలబంద మొక్క దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఈ మధ్య మారిన పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెడుతున్నారు. దాంతో మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటున్నారు. వాటిలో కలబంద ఒకటి. కలబంద తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు కలబంద తీసుకోవటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు,కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కలబందను తీసుకుంటే సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలోనూ, సంతానలేమీ సమస్యలతో బాధపడుతున్నవారు కలబందకు దూరంగా ఉంటేనే మంచిది. గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం సమస్యలు ఉన్నవారు కూడా లిమిట్ గానే తీసుకోవాలి.

కలబందను ఎక్కువగా తీసుకుంటే పొటాషియం లెవల్స్ తగ్గుతాయి. అది రక్తపోటు మీద ప్రభావం చూపి గుండెకు సంబందించిన సమస్యలు వస్తాయి. ఆపరేషన్లకు వెళ్లే రెండు వారాల ముందు నుంచే కలబందను వాడటం ఆపేయాలి.డయాబెటిస్ ఉన్నవారు కూడా కలబందను ఎక్కువగా తీసుకోకూడదు.

ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఎక్కువగా తీసుకోవటం అనర్ధమే కదా. కాబట్టి తగిన మోతాదులో తీసుకొని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారు అసలు కలబందకు దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు..