Kitchenvantalu

Rice Storing Tips: బియ్యం నిల్వ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా.. పురుగులు పట్టకుండా సింపుల్ టిప్స్

Rice Storing Tips in telugu:ఈ కాలంలో బియ్యం,పప్పులు వంటి వాటిలో పురుగులు పట్టేస్తు ఉంటాయి. అలాగే మనం ఒక్కోసారి బియ్యంను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కూడా పురుగులు పడుతూ ఉంటాయి. కొన్ని చిట్కాలను ఫాలో అయితే బియ్యంకు పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు.

బియ్యంను అధిక తేమ, తడిగా ఉన్న ప్రదేశాలలో.. సూర్యరశ్మికి తగిలే ప్రదేశాలలో నిల్వ చేయకుండా పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి. బియ్యంను డబ్బాలో నిల్వ చేసినప్పుడు గాలి చొరబడకుండా డబ్బా మూతను గట్టిగా పెట్టాలి. బియ్యంను సంచిలో పోసి ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చు.

వర్షాకాలంలో బియ్యంలో ఎక్కువగా పురుగులు పడుతూ ఉంటాయి. అందువల్ల వర్షాకాలంలో బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండటానికి బిరియాని ఆకులు వేయాలి. వేప ఆకులను కూడా బియ్యంలో వేస్తే వేప ఆకులలో ఉన్న గుణాలు బియ్యంలో పురుగులు పట్టకుండా నిరోదిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Click Here To Follow Chaipakodi On Google News