Lemon Storage Tips:నిమ్మకాయలు చెడిపోకుండా నెల రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఇలా చేస్తే సరి
How to Store lemon in telugu:మనం ప్రతి రోజు ఏదో రకంగా నిమ్మకాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మకాయలను మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి తొందరగా పాడవుతూ ఉంటాయి. ధర తక్కువగా ఉందని మనం ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలని తెచ్చుకుంటూ ఉంటాం. నిమ్మకాయలు ఫ్రెష్ గా తాజాగా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
నిమ్మ తొక్క రంగు మారితే నిమ్మరసం చేదుగా ఉంటుంది. కాబట్టి నిమ్మకాయలను తాజాగా ఉంచుకోవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించాలి. నిమ్మకాయలను గాలి చొరబడని కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్లో ఉంచాలి. ఇలా చేయడం వలన నిమ్మకాయలు తాజాగా నెల రోజులు పాటు నిల్వ ఉంటాయి.
జిప్ లాక్ బ్యాగ్ లో నిమ్మకాయలను నింపి సీలు వేసి ఫ్రిజ్లో పెడితే నిమ్మకాయలు తాజాగా ఉంటాయి. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఆ తర్వాత కొంచెం నూనె రాసి రుద్ది గాజు సీసాలో వేసి ఫ్రిజ్లో పెడితే పాడవకుండా తాజాగా ఎక్కువ రోజులు ఉంటాయి. బ్రౌన్ పేపర్లో ప్యాక్ చేసి ఫ్రిజ్లో పెడితే నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.