Kitchenvantalu

Mix Veg Ragi Soup:కేవలం 10 నిమిషాల్లో.. బరువు తగ్గాలనుకునే వారికి డయబెటిస్ ఉన్న వారికి.. మిక్స్ వెజ్ రాగి సూప్

Mix Veg Ragi Soup Recipe: రాగి వంటికి బలాన్నిచ్చే మంచి ఆహారం. మనం తీసుకునే ఫుడ్ లో రాగులను జోడిస్తే రోగ నిరోధక శక్తిని ఈజీగా పెంచుకోవచ్చు. రాగి దోశ,రాగి జావా అందరు చేసుకుంటు వుంటారు.రాగిపిండి తో వెజ్ సూప్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్దాలు
రాగి పిండి – 3 టేబుల్ స్పూన్స్
క్యారట్ – ¼ కప్పు
క్యాప్సికమ్ -1/4 కప్పు
పచ్చిబఠానీలు – ¼ కప్పు
కాలిఫ్లవర్ – ¼ కప్పు
టమోటాలు – ¼ కప్పు
ఉల్లిపాయలు – ¼ కప్పు
పచ్చిమిర్చి – 3
నీళ్లు – 3 కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
అజినోమోటో – చిటికెడు
వెల్లుల్లి -5-6 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ఒక ప్యాన్ లో మూడు కప్పుల నీళ్లను పోసుకోని మీడియం ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
2.మరిగే నీళ్లలో వెజిటెబుల్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి.
3.పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
4.ఇప్పుడు వేరొక గిన్నెలో రాగి పిండిని వేసుకోని కొద్దిగా నీళ్లు యాడ్ చేసి కలుపుకోని కలుపుకున్న రాగి పిండిని ఉడుకుతున్న కూరగాయల్లోకి వేసుకోవాలి.

5.ఎలాంటి ఉండలు లేకుండా కలుపుతూ యాడ్ చేసుకోవాలి.
6.కూరగాయలు ,రాగి పిండి మరుగుతుండగా వెల్లుల్లి రెబ్బలు వేసి మూతపెట్టుకోని మరి కాసేపు ఉడకించుకోవాలి.
7.మరుగుతున్న సూప్ లో స్ప్రింగ్ ఆనియన్స్,తగినంత ఉప్పు ,పెప్పర్ పొడి,అజినో మోటో వేసి బాగా కలుపుకోవాలి.
8.చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని వేడివేడి వెజ్ రాగి సూప్ సర్వ్ చేసుకోవడమే.