Cooking Tips:బజ్జీలు,వడలు వేయించిన తర్వాత మిగిలిన నూనెను పాడేస్తున్నారా.. ఎన్నో లాభాలు…
Useful Cooking Tips in Telugu:మనం సాధారణంగా మూకుడులో ఫ్రై చేసినప్పుడు లేదంటే వడ, బజ్జి, స్నాక్స్ వంటి వాటిని తయారు చేసినప్పుడు నూనె మిగిలిపోతూ ఉంటుంది. ఈ నూనెను చాలా మంది పాడేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది కూరలకు తాలింపు పెట్టటానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ నూనెను చాలా రకాలుగా వాడవచ్చు.
కచోరి వంటి వంటకాలకు పిండిని తయారు చేయటానికి ఈ నూనెను ఉపయోగించవచ్చు. తలుపులు మరియు కిటికీలకు గ్రీజు చేయటానికి ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెను sprey బాటిల్ లో పోసి తలుపులు మరియు కిటికీల హుక్స్ మరియు కీళ్లపై స్ప్రే చేస్తే సరిపోతుంది.
ఈ నూనెను ఒక డబ్బాలో పోసి మొక్కల దగ్గర పెడితే ఈ నూనె వాసనకు కీటకాలు మొక్కల దగ్గరకు రావు. అంతేకాక మిగిలిన నూనెను దీపాలను వెలిగించటానికి కూడా ఉపయోగించవచ్చు. మరి ఇప్పటి నుంచి మిగిలిన నూనెను పాడేయకుండా వాడటానికి ప్రయత్నం చేయండి.

