Kitchenvantalu

Paneer:ఇంట్లో పన్నీర్ చేస్తే విరిగిపోతుందా…పన్నీర్ సాప్ట్ గా బయట కొన్నట్టు రావాలంటే ఈ టిప్స్ పాటించండి

Homemade Paneer Recipe in telugu:పన్నీర్ అంటే మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. పనీర్ తో ఎన్నో రకాల కూరలు, స్వీట్స్, మసాలా వైరైటిలు చేస్తూ ఉంటాం. మనలో చాలా మంది ఈ పన్నీర్ ని మార్కెట్లో కొంటూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో చాలా సులభంగా చాలా ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు
1 liter చిక్కని పాలు
125 ml వెనిగర్
125 ml నీళ్ళు

తయారి విధానం
అడుగు మందంగా ఉన్న మూకుడులో పాలు పోసి ఒక పొంగు వచ్చాక పొయ్యి మీద నుంచి దింపాలి.ఒక కప్పులో నీరు వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేడి పాలలో పోస్తూ కలుపుతూ ఉంటే పాలు విరిగి ముద్దగా అయ్యి నీళ్లు వేరు పడతాయి. వెనిగర్ వేశాక పన్నీర్ రావటానికి దాదాపుగా రెండు నిమిషాల సమయం పడుతుంది.

ఒక జల్లెడలో ఒక వైట్ కాటన్ క్లాత్ వేసి అందులో ఈ పన్నీర్ ని పోసి నీటిని వడగట్టి గట్టిగా పిండాలి. పన్నీర్ ముద్దని క్లాత్ మీద చతురస్రాకారంలోకి సర్ది క్లాత్ తో కప్పి దానిపైన బరువు పెట్టాలి. ఒక అరగంట అలా వదిలేస్తే ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో పెడితే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ లో నుంచి తీసి వాడటానికి ముందు పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి వాడుకోవాలి.