Hot Water:వేడి నీటి స్నానంతో ఎన్ని లాభాలో తెలుసా…అసలు నమ్మలేరు
Hot Water Benefits in telugu :వేడి నీటి స్నానం చేస్తే వ్యాయామం చేసిన ఎఫక్ట్ వస్తుందని నిపుణులు అంటున్నారు. చాలా కఠినమైన వ్యాయామాలు చేసినప్పుడు శరీరం ఎలా వేడెక్కుతుందో…అదే విధంగా వేడి నీటితో స్నానం చేసినప్పుడు కూడా అలాగే శరీరం వేడెక్కుతుందని ఒక పరిశోధనలో తెలిసింది. వేడి నీటితో 40 నిమిషాల పాటు స్నానం చేస్తే 30 నిమిషాల వాకింగ్ తో సమానమని నిపుణులు చెప్పుతున్నారు.
వేడి నీటితో స్నానం చేయటం వలన దాదాపుగా 140 కేలరీలు ఖర్చు అవుతాయని ఒక అంచనా. అలాగే ఒక అరగంట సేపు బ్రిస్క్ వాకింగ్ చేసిన 140 కేలరీలు ఖర్చుఅవుతాయి . ప్రతి రోజు వేడి నీటి స్నానం చేయటం వలన మధుమేహం,రక్తపోటు తగ్గటమే కాకుండా గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
అదే అరగంట సైక్లింగ్ చేస్తే 630 కేలరీలు ఖర్చు అవుతాయి. అయితే వేడి నీటి కారణంగా ఇన్ని కేలరీలు ఖర్చు కావటం జరగదు. వేడినీటి స్నానం సైకిలింగ్ వ్యాయామంతో సమానం కాకపోయినా.. పెద్దమొత్తంలో క్యాలరీలను కరిగించటానికి సహాయపడుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే రోజంతా అలసిన అనుభూతి తగ్గటమే కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.