Beauty Tips

Aloe Vera Hair Packs : జుట్టు పెరుగుదలకు కలబందతో ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి

Alovera Hair fall Tips in Telugu : జుట్టుకు సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల కూడా వచ్చేస్తోంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి ఒక చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజీ గింజల పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక vitamin E capsule లోని ఆయిల్ ని వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.

కలోంజీ గింజలు జుట్టు పొడిగా మారకుండా చేయటమే కాకుండా జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్యను తగ్గించటంలో చాలా బాగా సహాయ పడుతుంది. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు లేకుండా చేస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా పోషకాలను అందిస్తుంది.

ఇక ఆలోవెరా విషయానికి వచ్చేసరికి…దీనిలో ఉండే లక్షణాలు మృతకణాలను తొలగించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. vitamin E capsule జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.