Beauty Tips

Skin Whitening Remedies: ముఖం కాంతివంతంగా, తెల్లగా ఉండాలంటే.. ఈ ప్యాక్స్‌ వేసేయండి..!

Rice and lemon Face Glow Tips In telugu : ఈ మధ్య కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు, సరైన జీవనశైలి లేకపోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ముఖానికి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యాన్ని వేసి నీటిని పోయాలి. దానిలో దానిలో ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి దానిని ఆరు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసి ఒక గంట సేపు అలా వదిలేయలి. గంట అయ్యాక బాగా కలిపి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీటిని కాటన్ బాల్ సాయంతో ముఖానికి పట్టించాలి.

పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి కాంతివంతగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా చక్కని ఫలితాన్ని ఇస్తాయి.

బియ్యం నీటిలో ఉన్న పోషకాలు ముఖం మీద ఉన్న మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. నిమ్మలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖం మెరవటానికి సహాయపడుతుంది. ఇక రోజ్ వాటర్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టటం కన్నా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.