Beauty Tips

White Hair: తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టే సూపర్ ఐడియా ఇది.. ఈ ఆకులతో హెయిర్ డై చేసుకుని వాడి చూడండి!

White Hair Home Remedies in Telugu : తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.

ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక 2 స్పూన్ల ఉసిరి ముక్కలను, 3 రెబ్బల కరివేపాకు ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా మరగటం వలన ఉసిరి, కరివేపాకులో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని ఒక బౌల్ లోకి వడకట్టాలి.

ఈ నీటిలో అరచెక్క నిమ్మరసం కలపాలి. ఈ నీటిని జుట్టుకి బాగా పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు, తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.

ఉసిరి ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం ఈ మూడు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్యకు కారణం అయినా చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.