MoviesTollywood news in telugu

Prabhas dupe:ప్రభాస్ కి డూప్ గా నటించే ఈ యాక్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Prabhas dupe:సాదారణంగా సినిమాల్లో ఎన్నో ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, రిస్కీ షాట్స్ ఉంటాయి. ఆ సీన్స్ చూసినప్పుడు ఒక అభిమానిగా మనం విజిల్స్ వేస్తూ హంగామా చేస్తాం. అయితే సినిమాల్లో ఆ సీన్స్ చేయటానికి హీరోలకు డూప్స్ ఉంటారు.

అలా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి కూడా ఓ డూప్ ఉన్నాడు. అతని పేరు కిరణ్ రాజ్. కిరణ్ బాహుబలి, సాహో, సలార్ వంటి సినిమాల్లో ప్రభాస్ కి డూప్ గా నటించి మెప్పించాడు.

ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్సకత్వంలో కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఆ సీన్స్ కోసం ప్రభాస్ డూప్ ను వాడారట. ఈ నేపథ్యంలో కిరణ్ రాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రభాస్ డూప్ గా చేయడానికి కిరణ్ రాజ్ ఒక్కో సినిమాకి రూ.30 లక్షల వరకు తీసుకుంటున్నాడట. సినిమాలో అవసరాన్ని బట్టి ఇంకా రెమ్యూనరేషన్ పెరుగుతుందని సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.