Beauty Tips

Face Glow Tips:ముఖం నల్లగా అయ్యిందా? ఇలా చేస్తే తెల్లగా అవుతుంది

Charcoal and Lemon Face pack:ముఖ సంరక్షణలో ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.

ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ధ పెడుతున్నారు. దాంతో ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని భావిస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. ఇలా చేస్తే ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం రావటమే కాకుండా శాశ్వతంగా ఉంటుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ బొగ్గు పొడి తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అయ్యాక సాధారణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు., మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

బొగ్గు పొడి మొఖం మీద తాన్, మృతకణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మనం .బొగ్గు తెచ్చుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి. బొగ్గు ఇస్త్రీ చేసే వారి దగ్గర .దొరుకుతుంది. పల్లెటూర్లో అయితే ప్రతి ఇంట్లోనూ కనబడుతూనే ఉంటుంది. మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది.

నిమ్మరసంలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు., విటమిన్ సి చర్మానికి పోషణ అందించి తెల్లగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.రోజ్ వాటర్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. వారంలో రెండుసార్లు ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే అంటే రెండు మూడు వారాల్లోనే మీకు మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."