spiced buttermilk:వేసవి తాపాన్ని తగ్గించే మసాలా మజ్జిగ.. సమ్మర్ లో కూల్ కూల్ గా…
spiced buttermilk : ఈ వేసవి కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలం వచ్చేసింది వచ్చేసింది. ఎండలు పెరిగిపోయాయి. ఎండలో బయటకు వెళ్లి వచ్చామంటే శరీరంలో సత్తువ అంతా స్ట్రా వేసుకొని ఎవరో పీల్చేసినట్టే..శ్రమతో కూడిన చెమటలు కమ్మేసినట్టే.
అలాంటి సమయంలో చల్లచల్లగా మసాలా మజ్జిగ త్రాగితే ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు వేసవి తాపాన్ని తీర్చే మసాలా మజ్జిగ ఎలా తయారుచేసుకోవాలో, తయారీకి అవసరమైన ఇంగ్రిడియన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
పెరుగు 1 కప్పు
కొత్తిమీర తరుగు 2 స్పూన్స్
పుదీనా తరుగు 2 స్పూన్స్
కరివేపాకు రెండు రెబ్బలు
అల్లం అంగుళం ముక్క
పచ్చిమిర్చి 2
జీలకర్ర పొడి అర స్పూన్
ఉప్పు సరిపడా
తయారి విధానం
ముందుగా కొత్తిమీర,పుదీనా,కరివేపాకు,అల్లం,పచ్చిమిర్చి,లను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పెరుగును మజ్జిగగా గిలకొట్టుకోవాలి. గిలకొట్టిన మజ్జిగలో పైన తయారు చేసుకున్న పేస్ట్, జీలకర్ర పొడి,ఉప్పు వేసి బాగా కలిపితే వేసవి తాపాన్ని తగ్గించే మసాలా మజ్జిగ రెడీ.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.


