Healthhealth tips in telugu

Summer Drink:వేసవిలో శరీరంలో వేడిని తగ్గించి శక్తిని పెంచి శరీరాన్ని రిఫ్రెష్ చేసే సత్తు షర్బత్

Summer Drink:వేసవిలో శరీరంలో వేడిని తగ్గించి శక్తిని పెంచి శరీరాన్ని రిఫ్రెష్ చేసే సత్తు షర్బత్.. వేసవికాలం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శరీరంలో వేడిని తగ్గించటానికి చలువ చేసే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. సత్తు పానీయంను వేసవిలో తీసుకుంటూ ఉంటే చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. దీని తయారీ కోసం వేపిన శనగలను తీసుకోవాలి.

వేపిన శనగలను పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ పొడిని వేసి బాగా కలపాలి. దీనిలో చిటికెడు బ్లాక్‌సాల్ట్,పావు స్పూన్ లో సగం పంచదార పొడి, పావు స్పూన్ లో సగం జీలకర్ర పొడి, కొంచెం పచ్చిమిర్చి తరుగు, అరస్పూన్ నిమ్మరసం, పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసి బాగా కలిపి,చివరిగా ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లగా తాగాలి.

సత్తులో ఐరన్, సోడియం, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేసి వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలోని విషాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ తాగితే రోజంతా శరీరాన్ని చల్లగా మరియు హైడ్రేట్ గా ఉంచుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాలు వేగంగా పెరగటానికి సహాయపడి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అందించటానికి సహాయపడుతుంది. దాంతో రోజంతా మీకు తగినంత శక్తి అందుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.