Kitchenvantalu

Vankaya Masala Curry:ఉదయం హడావిడిలో కూడా వంకాయ కూరని చిటికెలో ఇలా రుచిగా చేసేయచ్చు

Vankaya Masala Curry:ఉదయం హడావిడిలో కూడా వంకాయ కూరని చిటికెలో ఇలా రుచిగా చేసేయచ్చు..వంకాయ అంటే మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటారు.

కావాల్సిన పదార్ధాలు
తెల్ల వంకాయలు 250 గ్రా.,లుఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 5,పసుపు 1/4 టీ,స్పూన్ ,జీలలకర్ర 1 టీ స్పూన్,కొబ్బరి పొడి 3 టీస్పూన్లు,పల్లీలు 3 టేబుల్ స్పూన్లు,నువ్వులు 2 టీస్పూన్లు,మెంతులు 1/4 టీ స్పూన్, పెరుగు 1/2 టీ స్పూన్వె, అల్లం వెల్లుల్లిముద్ద 1/2 టీస్పూన్, ఉప్పు తగినంత,నూనె 4 టీస్పూన్లు,కొత్తిమీర కొద్దిగా,జీలకర్ర, మెంతులు 1/4 టీస్పూన్

తయారు చేయు విధానం
ఈ కూర తెల్ల వంకాయలతో చేస్తే బావుంటుంది. ముందుగా గిన్నె లేదా కడాయి వేడి చేసి జీలకర్ర, నువ్వులు, మెంతులు, పల్లీలు దోరగా వేయించి పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని వేయించిన ఉల్లిపాయలు, కొబ్బరిపొడి, పసుపు, తగినంత ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి

కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి మెత్తగా గుత్తులుగా లేదా పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తబడ్డాక రుబ్బిన మసాలా, కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి.ఉడికి నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి.