Kitchenvantalu

Cooking Tips:కుక్కర్ రబ్బర్ తరచుగా వదులుగా అయ్యి ఇబ్బందా? ఈ చిన్న టిప్స్ పాటించండి!

Cooking Tips:కుక్కర్ రబ్బర్ తరచుగా వదులుగా అయ్యి ఇబ్బందా? ఈ చిన్న టిప్స్ పాటించండి..ప్రతి రోజు వంటింటిలో ప్రెజర్ కుక్కర్‌ వాడకుండా ఏ పని జరగదు. ప్రెజర్ కుక్కర్‌ వాడితే వంట త్వరగా పూర్తి అవుతుంది. ఒక్కోసారి కుక్కర్ మూతకు ఉన్న రబ్బరు (గ్యాస్కెట్) వదులుగా మారుతుంది. అప్పుడు కుక్కర్ లో ప్రెజర్ తగ్గి వంట ఆలస్యం అవుతుంది.

ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే కుక్కర్ రబ్బరు (గ్యాస్కెట్) వదులుగా మారదు. కుక్కర్ మూత నుండి రబ్బరు తీసి చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల రబ్బరు కాస్త సంకోచం చెంది దగ్గరకు అవుతుంది. కుక్కర్‌లో వండటం వలన అందులోని రబ్బర్ అధిక వేడికి గురై.. అది కాస్త వదులుగా మారుతుంది.

కుక్కర్ రబ్బరును రిఫ్రిజిరేటర్ లో పది నిమిషాలు ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వలన రబ్బర్ గట్టి పడుతుంది. ఈ చిట్కాలను ఫాలో అయినా తర్వాత కూడా రబ్బరు వదులుగా ఉంటే మాత్రం రబ్బరును మార్చాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.