Beauty Tips

Face Glow Tips:తెల్లటి మెరిసే చర్మం కోసం ఆరాటపడుతున్నారా అయితే ఈ చిట్కా మీకోసమే

Face Glow Tips:తెల్లటి మెరిసే చర్మం కోసం ఆరాటపడుతున్నారా అయితే ఈ చిట్కా మీకోసమే..ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయిన పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే సహజసిద్దమైన పదార్ధాలతో మన ఇంటిలో తయారుచేసుకొనే ప్యాక్స్ చాలా బాగా పనిచేస్తాయి.

ఒట్స్ చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. మనలో చాలా మందికి ఒట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసు. ఒట్స్ ని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఒట్స్ పొడి,ఒక స్పూన్ చందనం పొడి,ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేయాలి.

ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడటానికి సహాయపడతాయి. సూర్యడి వేడి నుండి ఉత్పత్తి అయ్యే అల్ట్రా వయెలెట్ రేస్ నుండి కాఫీలోని కెఫిన్ చర్మాన్ని రక్షిస్తుంది. కెఫిన్ టిష్యూ రిపేర్ తోపాటు, సెల్ గ్రోత్ కి దోహదపడుతుంది. చర్మం మృదువుగా మంచి కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."