Beauty Tips

Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం

Face Glow Tips:40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం.. ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా మెరవడానికి మామిడిపండు చాలా బాగా సహాయపడుతుంది.

ఈ ఎండాకాలంలో మామిడిపండు చాలా విరివిగా దొరుకుతుంది. మనలో చాలా మంది మామిడి పండ్లను చాలా ఇష్టంగా తింటారు. మామిడిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అలాగే చర్మ సంరక్షణలో కూడా మామిడిపండు చాలా బాగా సహాయపడుతుంది. మామిడి పండులో విటమిన్ ఏ, సి సమృద్ధిగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మామిడి పండులో ఉండే విటమిన్ ఏ ముడతలు, మచ్చలను దూరం చేసి చర్మం కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది.

అలాగే మామిడి పండులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి కొలెజాన్ ఉత్పత్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మామిడి పండులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని పొడిగా లేకుండా తేమగా ఉంచుతుంది. మామిడిపండు గుజ్జును ముఖంపై రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే నల్లని మచ్చలు,ముడతలు అన్నీ తొలగిపోతాయి. కంటి కింద నల్లటి వలయాలు తొలగించుకోవడానికి కూడా మామిడిపండు బాగా సహాయపడుతుంది. మామిడిపండు గుజ్జును కంటి కింద నల్లని వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ సీజన్ లో మామిడి పండు గుజ్జును ముఖానికి ఉపయోగిస్తే ముఖం మీద నల్లని మచ్చలు,ముడతలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ఏమి లేకుండా యవ్వనంగా కనబడుతుంది. కాబట్టి మామిడి పండుతో ఆరోగ్యాన్ని పెంచుకోవటమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.