Beauty Tips

White Hair Turn Black:తెల్ల జుట్టు నల్లగా మారడానికి మీ ఇంట్లోనే చక్కని పరిష్కారం

White Hair Turn Black;తెల్ల జుట్టు నల్లగా మారడానికి మీ ఇంట్లోనే చక్కని పరిష్కారం.. మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఆలా జుట్టు తెల్లబడేసరికి చాలా మానసికంగా కృంగిపోతున్నారు. అయితే జుట్టు రంగు అనేది చిన్న వయస్సులోనే నిర్ణయించబడుతుంది. జుట్టు కింద భాగంలో ఉండే మెలనిన్ కణాలు జుట్టుకి రంగుని ఇస్తాయి.

మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు అనేది ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ మెలనిన్ స్థాయిలు తగ్గి జుట్టు తెల్లబడటం ప్రారంభం అవుతుంది. తెల్ల జుట్టు రావటం ప్రారంభం కాగానే కంగారు పడి హెయిర్ డ్రై వేసుకోవటానికి ఆసక్తి చూపుతారు. హెయిర్ డ్రై లో ఉండే రసాయనాలు జుట్టుకు,తల మీద చర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి మనం సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్ధాలతో తెల్లని జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు.

బంగాళదుంపలను తీసుకోని శుభ్రంగా కడిగి పై తొక్కను తొలగించాలి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి బంగాళాదుంప తొక్కలను వేసి బాగా మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని ఒక కప్పులోకి వడకట్టాలి. వడకట్టిన నీటిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని తలకు బాగా పట్టించి రెండు నిముషాలు మసాజ్ చేయాలి.

అరగంట అయ్యాక తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. బంగాళాదుంప తొక్క డైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే తెల్లని జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.