Beauty TipsHealth

Face Glow Tips:5 రూపాయిల ఖర్చుతో ఎంతటి నల్లని ముఖం అయిన తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది

Besan And Alovera Face Glow Tips : ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది సహజం కూడా. ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు రాగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. అలా కంగారు పడి పోకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ Fair & Lovely క్రీం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక నిమిషం నిదానంగా మసాజ్ చేయాలి. పది. నిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముఖం పై ఉన్న మృత కణాలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

కలబందలో ఉండే ఒక సమ్మేళనం చనిపోయిన మృతకణాలను తొలగించి నల్లటి మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది. శనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం మీద ఉన్న మలినాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మంచి ఫలితాన్ని పొందుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.