Kitchenvantalu

Tomato Pulihora:టమోటాతో ఒక సారి ఇలా పులిహోర చేసి పెట్టండి..తిన్నవారు ఆహా అనక మానరు

Tomato Pulihora:టమోటాతో ఒక సారి ఇలా పులిహోర చేసి పెట్టండి..తిన్నవారు ఆహా అనక మానరు..రుచి చాలా బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు 
బియ్యం – 1/4 కిలో
ట‌మాటాలు – 1/4 కిలో
చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్‌
ప‌చ్చిమిర్చి – 6
ఇంగువ – చిటికెడు
ప‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్లు
శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్లు
మిన‌ప పప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – త‌గినంత
ఎండు మిర‌ప‌కాయ‌లు – 4
ఆవాలు – 1 టీస్పూన్
నూనె – 100 ఎంఎల్
క‌రివేపాకు – 4 రెబ్బ‌లు
ప‌సుపు – 1 టీస్పూన్

ట‌మాటా పులిహోర త‌యారు చేసే విధానం:

ట‌మాటాలు, ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ను ముక్క‌లుగా కోసుకుని ఉడ‌క‌బెట్టాలి. చ‌ల్లారాక చింత‌పండు గుజ్జు క‌లిపి మెత్తగా రుబ్బుకోవాలి. అన్నం ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. వెడ‌ల్పుగా ఉన్న క‌ళాయి తీసుకుని అందులో ఉడికించిన అన్నం, ట‌మాటా గుజ్జు మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి.

అనంత‌రం మ‌రో క‌ళాయిలో నూనె పోసి వేడెక్కాక ప‌ల్లీలు, మిన‌ప పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండు మిర‌ప‌కాయ‌లు, ప‌సుపు వేసి బాగా వేపుకోవాలి. అనంతం క‌రివేపాకు కూడా వేసి బాగా వేగాక మొత్తం తాళింపును ట‌మాటా గుజ్జు క‌లిపిన అన్నంలో వేసి బాగా క‌ల‌పాలి. అంతే.. రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర త‌యార‌వుతుంది..