Beauty TipsHealth

Face Glow Tips:శనగపిండిలో ఇది కలిపి రాస్తే మొటిమలు,నల్లని మచ్చలు అన్నీ మాయం అవుతాయి

Besan Face Glow tips in telugu : శనగపిండిలో ఇది కలిపి రాస్తే మొటిమలు,నల్లని మచ్చలు అన్నీ మాయం అవుతాయి. ఇంటి చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు.

మనలో చాలా మంది ముఖం తెల్లగా, కాంతి వంతంగా, మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగిన పెద్దగా ఉపయోగం ఉండదు.

అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ సమయంలోనే ముఖం తెల్లగా,కాంతివంతంగా మారుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆలోవెరా(కలబంద) జెల్, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి తయారుచేసుకున్న పేస్ట్ ని ముఖానికి రాయాలి.

పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు అన్నీ తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. పెరుగు ఒక నేచురల్ స్కిన్ హైడ్రేట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంలో ఇది నేచురల్ మాయిశ్చరైజర్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది. దాంతో చర్మం సాప్ట్ గా మరియు కాంతివంతంగా మారుతుంది.

శనగపిండిని చర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించే అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తుంది. అలాగే అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎర్రబడిన చర్మాన్ని మృదువుగా,కాంతివంతంగా చేస్తుంది.

కలబంద చర్మాన్ని పొడిగా లేకుండా తేమగా ఉంచుతుంది. మొటిమలు, మచ్చలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబందలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉన్నాయి. ఈ ప్యాక్ వారంలో రెండు సార్లు వేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. తప్పకుండా ఈ ప్యాక్ ని ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.