Beauty TipsHealth

Dark Elbows:మోచేతులు నల్లగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ సులభమైన చిట్కాలను ట్రై చేసేయ్యండి..

Reduces Dark Elbows Home Remedies in telugu :మోచేతులు నల్లగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ సులభమైన చిట్కాలను ట్రై చేసేయ్యండి.. సాధారణంగా మహిళల మోచేతుల వద్ద నల్లబడి, చర్మం మొద్దుబారిపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది.

మిగతా చర్మం ఎంత అందంగా, మృదువుగా ఉన్నా మోచేతి కారణంగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మోకాళ్లపై కూడా చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ ఖర్చుతో కేవలం రెండు ఇంగ్రిడియన్స్ తో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం బంగాళాదుంప తీసుకోవాలి. బంగాళాదుంపను ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

బంగాళాదుంప పేస్ట్ లో నిమ్మరసం కలిపి నలుపు ఉన్న మోచేతులు, మోకాళ్ళపై రాసి 15 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గి మృదువుగా తెల్లగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బంగాళాదుంప,నిమ్మరసంలో ఉన్న లక్షణాలు నలుపును తగ్గించటానికి సహాయపడుతుంది. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.