MoviesTollywood news in telugu

Bhimaa Twitter Review: భీమా ట్విట్ట‌ర్ రివ్యూ -గోపీచంద్ హిట్ కొట్టినట్టేనా..!

Bhimaa Twitter Review: మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు గోపీచంద్ హీరోగా న‌టించిన భీమా సినిమా వచ్చింది. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ఏ హ‌ర్ష డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించారు.

డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో గోపీచంద్ చాలా బాగా నటించాడని..పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ డైలాగ్స్‌, యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ బాగున్నాయంటూ..అలాగే మ‌రోరోల్ మాస్ కోణంలో స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ని చెప్పుతున్నారు.

ఈ సినిమాలో గోపీచంద్ శివ‌తాండ‌వం చేసాడని.. చాలా రోజుల తర్వాత గోపీచంద్ కి తగ్గ కథ దొరికిందని..భీమాతో గోపీచంద్ మ‌ళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వ‌చ్చాడ‌ని అంటున్నారు.

యాక్ష‌న్ సీక్వెన్స్‌లు భీమా సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్ అని అంటున్నారు. అలాగే ప‌ర‌శురామ క్షేత్రానికి సంబంధించిన డివోష‌న‌ల్ పాయింట్‌ను కూడా ద‌ర్శ‌కుడు బాగా చూపించాడని అంటున్నారు. బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా ఉందని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుందని టాక్ వస్తుంది.