Kitchenvantalu

Curd: వేసవిలో ఇలా తోడేస్తే పెరుగు అస్సలు పుల్లగా మారదు

Curd: వేసవిలో ఇలా తోడేస్తే పెరుగు అస్సలు పుల్లగా మారదు..వేసవి కాలంలో పెరుగు చాలా త్వరగా పులుపుగా మారిపోతుంది. వేసవిలో పెరుగు తీయగా గట్టిగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. పెరుగు అంటే ఇష్టం లేనివారు ఉండరు.

పెరుగు తినడం వలన మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ వేసవికాలంలో పెరుగు కమ్మగా, తీయగా, గట్టిగా రావాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అవ్వండి.

సాధారణంగా మనం పాలను మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగ వేస్తే పాలు గట్టిగా తోడుకుంటుంది. దీనినే మనం పెరుగు అంటాము. అయితే పాలల్లో తోడు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది. తక్కువ వేస్తే పెరుగు తీయగా ఉంటుందని మనందరికీ తెలుసు.

వేసవికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు పుల్లగా రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.పాలను వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొంచెం పెరుగు, ఒక పచ్చిమిర్చి వేయాలి.

అయితే పచ్చిమిర్చికి కాడ తప్పనిసరిగా ఉండాలి. మిర్చి పూర్తిగా పాలల్లో మునగాలి. ఆ తర్వాత పాలను ఆరు గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. అప్పుడు పాలు తోడుకొని పెరుగు తియ్యగా గట్టిగా ఉంటుంది. తోడుకున్న పెరుగును చల్లగా ఉండాలంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.