Beauty Tips

Hair Care Tips:బలహీనమైన జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసే లవంగాలు.. ఎలా వాడాలో తెలుసా?

Cloves and Rice Hair Fall Tips In telugu :బలహీనమైన జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసే లవంగాలు.. ఎలా వాడాలో తెలుసా? జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి రెండు స్పూన్ల బియ్యం, ఒక స్పూన్ లవంగాలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టాలి. ఈ నీటిని జుట్టు మూలాల నుండి కుదుళ్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

బియ్యం నీరు జుట్టును లోతుగా శుభ్రం చేస్తుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు చిక్కు పడకుండా సిల్కీగా ఉండేలా చేస్తుంది. ఇది స్ప్లిట్ ఎండ్స్ ను కూడా తగ్గిస్తుంది. మంచి కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు మూలాలను బలంగా మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.

లవంగాలలో యుజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలో రక్తప్రసరణను పెంచి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాక జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. అలాగే ఇది స్ప్లిట్ ఎండ్స్ ను కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.