Kitchenvantalu

Onions In Fridge : తరిగిన ఉల్లి ముక్కలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా ..అయితే సమస్యలే

Onions In Fridge : తరిగిన ఉల్లి ముక్కలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా ..అయితే సమస్యలే..ప్రతి రోజు ఉల్లిపాయలను వంటలలో వాడుతూ ఉంటాం. ఒక్కోసారి కోసిన ఉల్లిపాయ ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిన ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు వాడుతూ ఉంటారు.

ఇలా మనలో చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చేయటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పచ్చి ఉల్లిపాయ వాసన ఇతర కూరగాయలను కూడా చెడిపోయేలా చేస్తుంది. ఇందులో సల్ఫర్ ఉండుట వలన ఉల్లిపాయలను కోసేటప్పుడు కంటి నుండి నీరు కారుతుంది.

అలాగే ఉల్లిపాయలను కోసి ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. అంతేకాక పోషక విలువలు తగ్గుతాయి. అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అయితే ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్ లో నిల్వ చేయాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.

ఉల్లిపాయలను నిల్వ చేయాలంటే గాలి చొరబడని ఎన్‌క్లోజర్‌ను ఉపయోగించాలి. కోసిన ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్ లో పెట్టిన సరే రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు.

ఏది ఏమైనా ఉల్లిపాయను అవసరం అయినప్పుడు కోసి వాడటం మంచిది. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి. ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/