MoviesTollywood news in telugu

Gaami OTT Release: ఓటీటీలోకి విజువల్ వండర్ మూవీ గామి…ఎప్పుడు.. ఎక్కడంటే?

Gaami OTT Release: మహా శివరాత్రి సందర్భంగా విశ్వక్ సేన్ నటించిన Gaami సినిమా విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో గామి ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. గామి ఓటీటీ హక్కులను (Gaami OTT Rights) ప్రముఖ సంస్థ జీ5 (ZEE5) కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

గామి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు (OTT Platforms) భారీగానే పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్‌గా భారీ వ్యయం వెచ్చించి గామి ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుందట.

అలాగే గామి సినిమాను నెల రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ (Gaami Digital Streaming) చేసేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే, గామి మూవీని ఎప్రిల్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేవరకు..దీనిలో ఎంత నిజం ఉందో తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జీ5 (ZEE5) లో హనుమాన్ సినిమా వస్తుందని ప్రకటన చేసారు. కానీ OTT లోకి రాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."