Beauty Tips

Face Glow Tips:చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీ కోసమే..

Face Glow Tips:చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీ కోసమే..చర్మం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరవటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటిలో దొరికే సహజసిద్దమైన వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి. ఈ పొడి కోసం ముందుగా క్యారెట్,కీరా దోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీలో వేసి జ్యూస్ గా తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ ని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి. ఈ జ్యూస్ చల్లారాక బియ్యం పిండిని వేసి బాగా కలిపి ఎండలో బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ తయారుచేసుకున్న పొడి,ఒక స్పూన్ టమోటా జ్యూస్,ఒక స్పూన్ రోజ్ వాటర్,చిటికెడు పసుపు వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి ముఖానికి రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోతాయి.

చర్మ సమస్యల కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.