Beauty Tips

Hair Care Tips:జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోందా..తగ్గేందుకు ఏం చేయాలంటే..

Hair Care Tips:జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోందా..తగ్గేందుకు ఏం చేయాలంటే..మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణంలో కాలుష్యం కారణంగా జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

చాలామంది జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్యలు వచ్చినప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇంటిలో దొరికే .సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

చిన్న ఉల్లిపాయన పేస్టుగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ పేస్ట్, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. .

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టుకి సంబంధించిన సమస్యలు జుట్టురాలే సమస్య, చుండ్రు వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఉల్లిపాయ చర్మంలో రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

బాదం నూనెలో ఉండే లక్షణాలు జుట్టు బలంగా మృదువుగా మెరవడానికి సహాయపడతాయి. ఆముదంను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగి స్తున్నారు. ఈ మిశ్రమం చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను, చుండ్రును తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.