Kitchenvantalu

Atukula Pulihora:కేవలం 10 నిమిషాల్లో అటుకులతో కమ్మని పులిహోర

Atukula Pulihora:కేవలం 10 నిమిషాల్లో అటుకులతో కమ్మని పులిహోర.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను బాగుంటుంది..సాయంత్రం సమయంలో తినటానికి కూడా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు
అటుకులు- 1 కప్పు
పచ్చిమిర్చి – 3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెద్ద ఉల్లిపాయ- 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వేరుశెనగలు (పల్లీలు)- 2 టేబుల్ స్పూన్స్
పచ్చి బఠాణి -3టేబుల్ స్పూన్స్
జీలకర్ర- 1/2 టీస్పూన్
వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూన్
పసుపు- 1/4 టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు- 2 రెమ్మలు
నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్
ఉప్పు-తగినంత,

తయారీ విధానం
అటుకులను ముందుగా శుభ్రం చేసుకొని నీటిలో వేసి,ఒక్క నిమిషం అయ్యాక నీరు లేకుండా పిండి పక్కన పెట్టాలి.స్టవ్‌పై మూకుడు పెట్టి తగినంత నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, వేరుశెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి.

ఆ తర్వాత ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణి వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి.ఆ తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి కలపాలి.అంతే, ఎంతో రుచికరమైన.. అటుకుల ఉప్మా(పోహా) రెడీ! మరిన్ని పోషకాల కోసం కూరగాయలతో కూడా అటుకుల పులిహోర (పోహా) తయారు చేసుకోవచ్చు.