Beauty Tips

Cracked Heels: పాదాల మడమల పగుళ్లకు ఇంట్లోనే ఖర్చులేని వైద్యం..ఇలా చేస్తే చాలు

Cracked Heels: పాదాల మడమల పగుళ్లకు ఇంట్లోనే ఖర్చులేని వైద్యం..ఇలా చేస్తే చాలు..వయస్సుతో సంబందం లేకుండా అన్ని వయస్సులవారిని పాదాల పగుళ్లు ఇబ్బందిని కలిగిస్తాయి.

పాదాల సంరక్షణ విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనుల్లో నిమగ్నమై పాదాల సంరక్షణ మీద శ్రద్ద పెట్టక పోవటం వలన ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

ఈ చలి కాలంలో పాదాల పగుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే మృదువైన అందమైన పాదాలను సొంతం చేసుకోవచ్చు.

ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో ఉల్లిరసం వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పంచదార, అరచెక్క నిమ్మరసం,అరస్పూన్ బేకింగ్ సోడా, కొంచెం తెల్లని టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి . ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాయాలి.

పావుగంట అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు తొలగి పోయి పాదాలు మృదువుగా, అందంగా కనపడతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉన్న లక్షణాలు పాదాల పగుళ్లను తగ్గించి కొత్త చర్మం రావటానికి చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.